అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం !

ABN , First Publish Date - 2020-06-03T13:28:53+05:30 IST

అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం చేస్తోంది.

అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం !

వాషింగ్టన్‌, జూన్‌ 2: అమెరికా నర్సింగ్‌ హోమ్స్‌లో కరోనా మృత్యుతాండవం చేస్తోంది. ఆ దేశంలో కరోనాతో లక్ష మందికిపైగా చనిపోగా.. వారిలో 26 వేల మంది నర్సింగ్‌హోమ్స్‌ వంటి సంరక్షణ కేంద్రాల్లోనే చనిపోయారని ఫెడరల్‌ హెల్త్‌ అధికారులకు అందిన నివేదిక చెబుతోంది. ఇది అమెరికా మరణాల్లో 25శాతం. కాగా అమెరికాలో కొత్తగా 22 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 1,047మంది మరణించారు.


Updated Date - 2020-06-03T13:28:53+05:30 IST