25 సెకన్లలో వైరస్‌ ఖతం

ABN , First Publish Date - 2020-04-05T08:53:46+05:30 IST

కరోనాపై ధైర్యసాహసాలతో పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రెండు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఇందులో మొదటిది పర్సనల్‌ శానిటైజేషన్‌...

25 సెకన్లలో వైరస్‌ ఖతం

  • కరోనా వైద్యులను శుభ్రపరిచే ‘ఎన్‌క్లోజర్‌’
  • రెండు ఉపకరణాలను అభివృద్ధిచేసిన డీఆర్డీవో 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : కరోనాపై ధైర్యసాహసాలతో పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రెండు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఇందులో మొదటిది పర్సనల్‌ శానిటైజేషన్‌ ఎన్‌క్లోజర్‌. ఇందులో ఉండే షవర్‌  హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని విడుదల చేస్తుంది. వైద్యులు ఈ షవర్‌ కింద కేవలం 25 సెకన్లపాటు నిలబడితే వారి దుస్తులపై ఉండే వైర్‌సలు నశిస్తాయి. ఎన్‌క్లోజర్‌ యంత్రంలో 700 లీటర్ల హైపో సోడియం క్లోరైడ్‌ను నింపే వీలుంది. ఒక్క ట్యాంకు ద్రావణం 650 మంది డాక్టర్ల వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగపడుతుంది. అలాగే కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు ఉపయోగించేందుకు తేలికపాటి ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇప్పటికే 100 ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌లను  ఈఎ్‌సఐసీ హాస్పిటల్‌లకు అందించగా మరో 10,000 తయారీకి ఆర్డర్లు వచ్చాయని డీఆర్డీవో తెలిపింది. 

Updated Date - 2020-04-05T08:53:46+05:30 IST