మల్లీశ్వరి పతక కాంతులకు 20 ఏళ్లు

ABN , First Publish Date - 2020-09-20T09:17:08+05:30 IST

ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి.

మల్లీశ్వరి పతక కాంతులకు 20 ఏళ్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా కరణం మల్లీశ్వరి చరిత్ర సృష్టించి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట అనే మారుమూల ప్రాంతం నుంచి సిడ్నీ ఒలింపిక్స్‌ (2000)లో కాంస్య పతకం కొల్లగొట్టడం వరకు సాగిన తన ప్రస్థానంలో మల్లీశ్వరి అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అందుకే భారత క్రీడా చరిత్రలో ఆమె ఒలింపిక్‌ మెడల్‌ సాధించిన 2000, సెప్టెంబరు, 19వ తేదీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఘనతతో ఆమె దేశంలో ఎందరో క్రీడాకారిణులకు ప్రేరణగా నిలిచింది. మల్లీశ్వరి తన వెయిట్‌లిఫ్టింగ్‌ కెరీర్‌లో వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం పతకంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలను ముద్దాడింది. మల్లీశ్వరి ప్రస్తుతం హరియాణాలోని భారత ఆహార గిడ్డంగుల సంస్థ జీఎంగా విధులు నిర్వహిస్తోంది.

Updated Date - 2020-09-20T09:17:08+05:30 IST