గజ్వేల్‌ స్పోర్ట్స్‌ హబ్‌కు 20 ఎకరాలు

ABN , First Publish Date - 2022-01-23T08:33:05+05:30 IST

సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించ తలపెట్టిన మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం (స్పోర్ట్స్‌ హబ్‌)కు భూ కేటయింపు పూర్తయింది.

గజ్వేల్‌ స్పోర్ట్స్‌ హబ్‌కు  20 ఎకరాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించ తలపెట్టిన మల్టీ పర్పస్‌ ఇండోర్‌ స్టేడియం (స్పోర్ట్స్‌ హబ్‌)కు భూ కేటయింపు పూర్తయింది. ఈ మేరకు గజ్వేల్‌ గ్రామంలోని 560/1 సర్వే నెంబర్‌లో గల 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌)కు బదలాయిస్తూ సిద్ధిపేట ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ తెలంగాణలోనూ క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు మంత్రి హరీ్‌షరావు, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి స్పోర్ట్స్‌ హబ్‌ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, టీటీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌తో కలిపి పది క్రీడలకు ఉపయోగపడేలా స్పోర్ట్స్‌ హబ్‌ను నిర్మించనున్నారు.

Updated Date - 2022-01-23T08:33:05+05:30 IST