బిడ్డకు జన్మనిచ్చిన 18ఏళ్ల యువతి.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులు షాక్.. నడీరోడ్డుపై ఆమె..

ABN , First Publish Date - 2022-01-12T22:23:28+05:30 IST

ఆమెకు 18ఏళ్లు. గర్భందాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. నడీరోడ్డుపై ఆ యువతి చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అ

బిడ్డకు జన్మనిచ్చిన 18ఏళ్ల యువతి.. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులు షాక్.. నడీరోడ్డుపై ఆమె..

ఎన్నారై డెస్క్: ఆమెకు 18ఏళ్లు. గర్భందాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. నడీరోడ్డుపై ఆ యువతి చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అది చూసి పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రానికి చెందిన 18ఏళ్ల అలెక్సిస్ ఆలివా కొన్ని నెలల క్రితం గర్భందాల్చింది. అయితే తాను గర్భం దాల్చిన విషయాన్ని ఈ జనవరి 6 వరకు అలెక్సిస్ గుర్తించలేకపోయింది. ఆ తర్వాత విషయం తెలిసి భయాందోళనలకు గురైంది. తాజాగా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు జన్మించిన చిన్నారిని కారులో తీసుకొచ్చి రోడ్డుపై ఉన్న డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. వీడియో చూసి కంగుతిన్న అధికారులు.. విచారణ జరిపి అలెక్సిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా అలెక్సిస్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రసవం తర్వాత భయాంతోళన, కంగారు వల్ల పుట్టిన బిడ్డను డస్ట్‌బిన్‌లో పడేశానని పేర్కొంది. కాగా.. అలెక్సిస్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కటకటాల్లోకి నెట్టారు. 




Updated Date - 2022-01-12T22:23:28+05:30 IST