18 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన Kuwait.. భవిష్యత్తులో వాళ్లను మళ్లీ రానీయొద్దంటూ..

ABN , First Publish Date - 2022-06-21T18:15:03+05:30 IST

చట్ట విరుద్ధంగా, సరియైన ధృవపత్రాలు లేకుండా, అసాంఘీక కార్యాకలాపాలకు పాల్పడుతున్న ప్రవాసులపై గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతోంది.

18 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించిన Kuwait.. భవిష్యత్తులో వాళ్లను మళ్లీ రానీయొద్దంటూ..

కువైత్ సిటీ: చట్ట విరుద్ధంగా, సరియైన ధృవపత్రాలు లేకుండా, అసాంఘీక కార్యాకలాపాలకు పాల్పడుతున్న ప్రవాసులపై గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల వరుస తనిఖీలతో అక్రమంగా ఆ దేశంలో ఉంటున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తుంది. ఆ తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తుంది. తాజాగా ఇదే కోవలో సాల్మియా ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో 18 మంది ప్రవాసులు పట్టుబడ్డారు. వీరందరినీ స్థానికంగా ఉండే ఓ ఇంట్లో జూదం(Gambling) ఆడుతున్న సమయంలో విదేశాంగ శాఖకు చెందిన క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బహిష్కరణ కేంద్రానికి(Deportation Center) తరలించారు. ఈ 18 మందిని ఇకపై ఎప్పటికీ కువైత్‌తో పాటు ఏ ఇతర గల్ఫ్ దేశాలకు రానీయకుండా నిషేధం విధించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రవాసులను హెచ్చరించారు. అక్రమంగా దేశంలో ఉండడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అమ్నెస్టీల ద్వారా సరియైన ధృవపత్రాలు లేని, వీసా గడువు ముగిసిన ప్రవాసులను దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం కల్పించిన విషయాన్ని అధికారులు గుర్తుచేశారు.      


Updated Date - 2022-06-21T18:15:03+05:30 IST