వీబీఎం: శ్రీలంక నుంచి స్వదేశానికి చేరిన 174 మంది భారతీయులు

ABN , First Publish Date - 2020-09-25T16:37:48+05:30 IST

కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్(వీబీఎం) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

వీబీఎం: శ్రీలంక నుంచి స్వదేశానికి చేరిన 174 మంది భారతీయులు

కొలంబో: కరోనా లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్(వీబీఎం) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా గురువారం శ్రీలంక నుంచి 174 మంది భారత ప్రవాసులు ఎయిరిండియా విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. AI 1284 విమానం 174 మందిని కొలంబో నుంచి ముంబై, ఢిల్లీకి తీసుకువచ్చింది. ఈ సందర్భంగా కొవిడ్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను స్వదేశానికి తీసుకురావడం కోసం కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ కార్యక్రమంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, జూన్ 1 నుంచి ఇప్పటివరకు శ్రీలంక నుంచి భారతదేశానికి మొత్తం తొమ్మిది రిపాట్రియేషన్ విమానాలు వచ్చాయి. వీటి ద్వారా సుమారు 2వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-09-25T16:37:48+05:30 IST