Abn logo
Aug 3 2020 @ 05:19AM

అర్బన్‌ జిల్లాలో 138 పాజిటివ్‌ కేసులు

హన్మకొండ అర్బన్‌, ఆగస్టు 2: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఆదివారం 138 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారిలో అత్యవసర వైద్యసేవలు అవసరమైనవారిని ఎంజీఎం కోవిడ్‌ విభాగంలో చేర్పించారు. మిగిలిన వారికి హోంక్వారంటైన్‌లో ఉంచి ఐసోలేషన్‌ కిట్లు అందజేశారు. బాధితుల ఆరోగ్యస్ధితిని బట్టి హోంక్వారంటైన్‌ పొడిగిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ లలితాదేవి, ఎంజీఎం ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement