Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఈరోజు రాష్ట్రంలో కరోనా నుంచి మరో 58 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 998 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీలో 24 గంటల్లో 45,702 కరోనా పరీక్షలు చేశారు. 


మరోవైపు ఆదివారం కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేగింది. మహానంది మండలం తిమ్మాపురంలో పలువురికి కారోనా సోకింది. ఏపీ మోడల్ స్కూల్‌లో ఐదుగురు విద్యార్థినులకు కరోనా నిర్ధారణ అయింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులకు కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యార్థులందరికీ హోంక్వారంటైన్‌కు తరలించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వ్యైదులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  

Advertisement
Advertisement