లాక్ డౌన్ నిబంధనలను పాటించని బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-03-30T05:26:31+05:30 IST

లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్న 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లాండ్‌లోని లీడ్స్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

లాక్ డౌన్ నిబంధనలను పాటించని బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

లీడ్స్: లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై తిరుగుతున్న 13 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లాండ్‌లోని లీడ్స్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాలుడిని అడ్రస్ అడిగినా చెప్పేందుకు నిరాకరించాడని.. దీంతో తాను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసు అధికారి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఇంగ్లాండ్‌లో లాక్ డౌన్‌ను పట్టించుకోకుండా ఫుట్ బాల్ ఆడుతున్న యువకులపై కూడా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంగ్లాండ్ ప్రభుత్వం గత గురువారం నుంచి పోలీసులకు కొత్త అధికారాలను ఇచ్చింది. దీని ప్రకారం లాక్‌డౌన్ సమయంలో ప్రతి పోలీసు అధికారి ‘ఫోర్ సెక్షన్ ప్లాన్’ను అనుసరించాల్సి ఉంటుంది. అంటే.. ఎవరైనా రోడ్డు మీద కనపడితే ముందుగా వారు బయటకు రావాల్సిన అవసరం గురించి అధికారి తెలుసుకోవాలి. అవసరం లేకపోయినా వచ్చారని తెలిస్తే వారి వివరాలు తీసుకుని ఇంటికి పంపించేయాలి. ఇక వివరాలు చెప్పకుండా, వెనుదిరగడానికి నిరాకరిస్తే ఫైన్ వేసే అధికారం పోలీసులకు ఉంటుంది. బయటకు వచ్చిన కారణాలు, వారి తీరు బట్టి ఫైన్ 30 యూరోల నుంచి వెయ్యి యూరోల వరకు ఉంటుంది. ఇక ఫైన్ స్టేజ్ కూడా దాటిపోతే పోలీసులు ఆయా వ్యక్తులను అరెస్ట్ చేయవచ్చు.


చైనాలో మొదలైన సూక్ష్మజీవి కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో రోజురోజుకూ పరిస్థితి మెరుగుపడుతోంటే.. అమెరికాలో, యూరప్ ఖండంలో మాత్రం పరిస్థితి చేయి దాటిపోతోంది. ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండాలంటూ ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా అనేక చోట్ల ప్రజలు వినిపించుకోవడం లేదు. దీంతో కొన్ని చోట్ల పోలీసులకు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలను ఇస్తోంది. 

Updated Date - 2020-03-30T05:26:31+05:30 IST