Abn logo
Mar 4 2021 @ 02:21AM

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

హాట్‌విల్లే, మార్చి 3: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోని హాట్‌విల్లే ప్రాంతంలో ఓ ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 25మందిలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మెక్సికో వాసులేనని చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే 12 మంది మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.  


Advertisement
Advertisement
Advertisement