రాహుల్ హత్య కేసులో 13 మంది నిందితులు: సీపీ

ABN , First Publish Date - 2021-08-27T22:28:54+05:30 IST

ఈ నెల 18న పారిశ్రామిక వేత్త రాహుల్‌ను హత్య చేశారని సీపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాహుల్ హత్యకు సంబంధించిన

రాహుల్ హత్య కేసులో 13 మంది నిందితులు: సీపీ

విజయవాడ: ఈ నెల 18న పారిశ్రామిక వేత్త రాహుల్‌ను హత్య చేశారని సీపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం రాహుల్ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వివరించారు. కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరున్నారో తెలుసుకున్నామని సీపీ పేర్కొన్నారు. వ్యాపారాల్లో కోరాడ విజయ్‌కుమార్‌తో రాహుల్‌కు గొడవలు ఉన్నాయని తెలిపారు. గాయత్రి అనే మహిళతో కలిసి కోరాడ చిట్స్ వ్యాపారం చేశాడని చెప్పారు.  కోగంటి సత్యం ద్వారా తన వాటా కోసం కోరాడ రాహుల్‌పై ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. గాయత్రి కుమార్తెకు మెడికల్ సీటు ఇస్తానని రాహుల్ 6 కోట్లు తీసుకున్నాడని, 18వ తేదీ రాత్రి 7.30 గంటలకు వివాదం సెటిల్ చేసుకుందాం అని పిలిచి హత్య చేశారని, మొత్తం 13 మంది నిందితులు ఉన్నారని వీరిలో ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. హత్యలో పాల్గొన్న ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉందని శ్రీనివాసులు చెప్పారు.

Updated Date - 2021-08-27T22:28:54+05:30 IST