అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-04-17T17:08:07+05:30 IST

న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ స్ట్రీట్‌సబ్‌వేలో మంగళవారం జరిగిన ఘటనను మరువకముందే అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం.. 12 మందికి గాయాలు

వాషింగ్టన్: న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ స్ట్రీట్‌సబ్‌వేలో మంగళవారం జరిగిన ఘటనను మరువకముందే అగ్రరాజ్యంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈసారి సౌత్ కరోలినాలోని కొలంబియాలో శనివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. స్థానికంగా ఉండే ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ఈ కాల్పుల్లో 12 మంది గాయపడ్డారని కొలంబియా పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం ఆయుధాలు కలిగి ముగ్గురు నిందితులను కొలంబియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఆ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఘటన సమయంలో మాల్‌లో భారీ సంఖ్యలో జనాలు ఉన్నారని, అందుకే పథకం ప్రకారం దుండగులు కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌ ప్రాంతంలోని స్ట్రీట్‌సబ్‌వేలో మంగళవారం కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. దుండగుడు తొలుత పొగబాంబులు వేసి.. కాల్పులకు పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత ఈ ఘటనలో నిందితుడైన 62 ఏళ్ల ఫ్రాంక్ ఆర్ జేమ్స్‌ను న్యూయార్క్, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-17T17:08:07+05:30 IST