king cobra: అనకాపల్లిలో 12 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్

ABN , First Publish Date - 2022-09-16T16:19:15+05:30 IST

జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్ చేసింది.

king cobra: అనకాపల్లిలో 12 అడుగుల కింగ్ కోబ్రా హల్‌చల్

అనకాపల్లి: జిల్లాలో 12 అడుగుల కింగ్ కోబ్రా (King cobra) హల్‌చల్ చేసింది. వి మాడుగుల మండలం కాశీపురం శివారు గ్రామం లక్ష్మీ, పేట గ్రామంలో బాత్రూంలో 12 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈస్ట్రన్ గార్డ్ వైల్డ్ లైఫ్ సొసైటీ (Eastern Guard Wildlife Society)సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సభ్యులు... కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ అధికారులతో కలిసి కింగ్ కోబ్రాను వంట్లమామిడి సమీపంలో కొండ ప్రాంతంలో రెస్క్యూ టీమ్ విడిచిపెట్టింది. 

Updated Date - 2022-09-16T16:19:15+05:30 IST