108 చదరపు అడుగులు రూ.1.20 కోట్లు!

ABN , First Publish Date - 2021-04-01T08:02:21+05:30 IST

అది కేవలం 108 చదరపు అడుగుల స్థలం! వేలంలో రూ.1.20 కోట్లు పలికింది. కొన్నది బడా వ్యాపారో, రియల్టరో కాదు! తోపుడుబండిపై అరటి పండ్లు అమ్ముకుని జీవించే వ్యక్తి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!

108 చదరపు అడుగులు రూ.1.20 కోట్లు!

వేలంలో కొన్న తోపుడుబండి వ్యాపారి

40 ఏళ్లుగా ఒకేచోట అరటిపండ్ల అమ్మకం

కోటీ 20లక్షలతో స్థలం కొనేశాడు 108 చదరపు అడుగులను 

వేలంలో కొన్న అరటిపండ్ల వ్యాపారి


బుచ్చిరెడ్డిపాళెం, మార్చి 31: అది కేవలం 108 చదరపు అడుగుల స్థలం! వేలంలో రూ.1.20 కోట్లు పలికింది. కొన్నది బడా వ్యాపారో, రియల్టరో కాదు! తోపుడుబండిపై అరటి పండ్లు అమ్ముకుని జీవించే వ్యక్తి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో ఎస్‌కే జిలాని అనే చిరువ్యాపారి ఈ సాహసం చేశాడు. ముంబై జాతీయ రహదారికి ఆనుకుని, బస్టాండ్‌ సెంటర్‌ సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఒకే చోట 40 ఏళ్లుగా ఆయన తోపుడు బండిపై అరటిపండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నారు.  అయితే... ఇటీవల అక్కడ పాత షాపులు పడగొట్టి, కొత్త వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ విషయం జిలాని చెవిలో పడింది. కాంప్లెక్స్‌ కడితే అక్కడి నుంచి తనను పంపించేస్తారని, జీవనాధారం పోతుందని ఆందోళన చెందారు. అదే కాంప్లెక్స్‌లో ఎంతోకొంత స్థలం కొనాలని నిర్ణయించుకున్నారు. బుధవారం జరిగిన వేలంలో ఆయన కూడా పాల్గొన్నారు.  108 చదరపు అడుగుల (ఒకటిన్నర అంకణం) స్థలాన్ని రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్నారు. 

Updated Date - 2021-04-01T08:02:21+05:30 IST