Donald Trump ఆసక్తికర వ్యాఖ్యలు.. అమెరికాలో 10కోట్ల మరణాలు..!

ABN , First Publish Date - 2021-08-09T18:18:11+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొవిడ్ వ్యాక్సిన్, కరోనా మరణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భారీ విపత్తు నుంచి అమెరికా బయటపడింద

Donald Trump ఆసక్తికర వ్యాఖ్యలు.. అమెరికాలో 10కోట్ల మరణాలు..!

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొవిడ్ వ్యాక్సిన్, కరోనా మరణాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భారీ విపత్తు నుంచి అమెరికా బయటపడిందన్నారు. డొనాల్ ట్రంప్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..‘కరోనా విజృంభణ వేళ మా ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. యుద్ధ ప్రాతిపదికన భారీ మొత్తంలో వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో భారీ విపత్తు తప్పింది. లేకుంటే అమెరికాలో బహుశా 10కోట్ల మరణాలు నమోదయ్యేవేమో. దీనికి నేను నిజంగా గర్వ పడుతున్నాను’ అని వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికాలో మొత్తం జనాభా 333 మిలియన్లు కాగా.. ట్రంప్ ప్రభుత్వం 200 మిలియన్ డోసుల ఫైజర్, 200 మిలియన్ డోసుల మోడెర్నా టీకాలను కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో ఇప్పటి వరకు 6.16లక్షల మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. 


Updated Date - 2021-08-09T18:18:11+05:30 IST