సూపర్‌ బామ్మ

ABN , First Publish Date - 2022-06-22T09:49:07+05:30 IST

శతాధిక వృద్ధురాలు రాంబాయి.. సూపర్‌ బామ్మ అనిపించింది. 105 ఏళ్ల వయసులో స్ర్పింట్‌ క్వీన్‌గా అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

సూపర్‌ బామ్మ

105 ఏళ్ల వయసులో 100 మీ. రికార్డు

వడోదర: శతాధిక వృద్ధురాలు రాంబాయి.. సూపర్‌ బామ్మ అనిపించింది. 105 ఏళ్ల వయసులో స్ర్పింట్‌ క్వీన్‌గా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తొలి జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప 100 మీ. రేస్‌లో హరియాణాకు చెందిన రాంబాయి 45.40 సెకన్ల రికార్డు టైమింగ్‌తో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో మాస్టర్స్‌లో విభాగంలో మన్‌ కౌర్‌ (74 సెకన్లు) జాతీయ రికార్డును రాంబాయి అధిగమించింది. అయితే, 85 ఏళ్లకు పైబడిన విభాగంలో ఆమెకు కనీస పోటీదారు కూడా లేరు. సింగిల్‌గా రేసు ఆరంభం నుంచి రాంబాయి నిలకడగా పరిగెత్తి ఫినిషింగ్‌ లైన్‌ చేరింది. వీక్షకులు కరతాళ ధ్వనులతో ఆమెలో ఉత్సాహాన్ని నింపారు. 

Updated Date - 2022-06-22T09:49:07+05:30 IST