10వేల కోట్ల రూపాయలు వృధా?

ABN , First Publish Date - 2020-08-02T16:42:21+05:30 IST

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయంతో..

10వేల కోట్ల రూపాయలు వృధా?

అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయంతో అమరావతి అటుకెక్కడంతో ఇక్కడ జరిగిన రూ. 10వేల కోట్ల పనులు వృధా కానున్నాయి. అటు హ్యాపీనెస్ ఎన్నార్టీపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కొనుగోలు దారులు లబో దిబో మంటున్నారు. సుమారు రూ. 48 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావించిన అమరావతి రాజధానికి ఇప్పటి వరకు వెచ్చించిన సుమారు  రూ. 10వేల కోట్లు వృధాయేనా? ఈ మొత్తం ప్రజా ధనం నీటిపాలు చేసినట్లేనా? తాజాగా పాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రతి ఒక్కరిలోనూ తలెత్తిన సందేహాలు ఇవి. దేశంలోనే అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందని అందరూ భావించారు. లెక్కకు మిక్కిలిగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు, విద్యా, వైద్యం, ఆర్థిక తదితర సంస్థల స్థాపనతో దేశంలోనే అత్యుత్తమ నగరమిక్కడే ఏర్పడుతుందని అనుకున్నారు. అయితే గవర్నర్ తాజా నిర్ణయంతో ఇప్పుడు అమరావతి పూర్తిగా అటుకెక్కింది.

Updated Date - 2020-08-02T16:42:21+05:30 IST