1 కాదు 24 కాలేజీలు

ABN , First Publish Date - 2022-09-23T08:23:28+05:30 IST

1 కాదు 24 కాలేజీలు

1 కాదు 24 కాలేజీలు

మా హయాంలో మెడికల్‌ కళాశాలల ఏర్పాటు

ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యకు టీడీపీ కౌంటర్‌

ప్రాంతాల వారీగా కాలేజీల జాబితా విడుదల 


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్‌ కళాశాల కూడా ఏర్పాటు కాలేదని అసెంబ్లీలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యపై టీడీపీ స్పందించింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత మొత్తం 24 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించింది. తమ హయాంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలల జాబితాను గురువారం టీడీపీ విడుదల చేసింది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల (నెల్లూరు, 2014), పద్మావతి ప్రభుత్వ మహిళా వైద్య కళాశాల (తిరుపతి, 2014), విశ్వ భారతి వైద్య కళాశాల (కర్నూలు,2014), గీతం మెడికల్‌ కళాశాల (విశాఖపట్నం, 2015), గాయత్రి విద్యా పరిషత్‌ కళాశాల (విశాఖపట్నం, 2016), అపోలో వైద్య కళాశాల (చిత్తూరు, 2016), ఎయిమ్స్‌ వైద్య కళాశాల (విజయవాడ, 2018), నిమ్రా వైద్య కళాశాల (విజయవాడ, 2016), అల్లూరి సీతారామరాజు వైద్య కళాశాల (ఏలూరు, 2000), డాక్టర్‌ పీఎస్‌ వైద్య కళాశాల (విజయవాడ, 2002), ప్రభుత్వ వైద్య కళాశాల (అనంతపురం, 2000), జీఎ్‌సఎల్‌ వైద్య కళాశాల (రాజమండ్రి, 2002), కాటూరి వైద్య కళాశాల (గుంటూరు, 2002), మహారాజా వైద్య కళాశాల (విజయనగరం, 2002), నారాయణ వైద్య కళాశాల (నెల్లూరు, 2000), పీఈఎస్‌ వైద్య కళాశాల (కుప్పం, 2001), ప్రతిమ వైద్య కళాశాల (కరీంనగర్‌, 2001), దక్కన్‌ మెడికల్‌ కళాశాల (హైదరాబాద్‌, 1985), కామినేని వైద్య కళాశాల (నార్కెట్‌పల్లి, 1999), మమత వైద్య కళాశాల (ఖమ్మం, 1998), మెడిసిటి వైద్య కళాశాల (ఘన్‌పూర్‌, 2002), ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాల (సంగారెడ్డి, 2002), చెలిమెడ ఆనందరావు వైద్య కళాశాల (కరీంనగర్‌, 2003), ఎస్వీఎస్‌ వైద్య కళాశాల (మహబూబ్‌నగర్‌, 1999) ఏర్పాటు చేసినట్టు తెలిపింది. 


Updated Date - 2022-09-23T08:23:28+05:30 IST