రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు గురువారం ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై సుబేదారి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమకొండలో బుధవారం ‘రైతు సంగ్రామ సదస్సు’ను బీఆర్ఎస్ నేతలు నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు బంద్ పెట్టి.. రాహుల్‌గాంధీకి కప్పం కడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కనపడితే రైతుబంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని కాలర్ పట్టుకుని నిలదీయాలని హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. యుద్ధం సాకుచూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
ములుగు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిం చిన వారిని ఉన్నట్టుండి దాడి చేస్తూ గాయరుస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. కోతుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో ఎలికట్టే కవిత, శ్రీనివాస్ దంపతులు నివసిస్తున్నారు.
జనగామలో ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.