కాామారెడ్డి జిల్లాలో ఓ బాలుడు కైట్ ఎగరవేస్తూ భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మరణించాడు.
బెట్టింగ్ యాప్‌ల బారిన పడి.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఫాంహౌస్ నీటి తొట్టిలో ప్రమాదవశాత్తూ పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందాడు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కొల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డిలో జరిగింది.
సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ మహిళ లక్షలు పోగొట్టుకుంది. ఓ యాప్‌ను నమ్మి డబ్బులు పెట్టింది మహిళ. చివరకు ఉన్న డబ్బులు స్వాహా అవ్వడంతో పోలీసులను ఆశ్రయించింది.
కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
నకిలీ కుల ధృవీకరణ పత్రంతో ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్‌గా ఎన్నికైనట్లు గ్రామస్తులు గుర్తించారు. అతడిని వెంటనే డిస్మిస్ చేసి.. మళ్లీ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తీసుకున్న లోన్ నగదును బ్యాంకులో ఆ రైతు చెల్లించాడు. అది నకిలీ నగదుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు. ఈ నగదు నీకు ఎక్కడి నుంచి వచ్చిదంటూ రైతును బ్యాంకు సిబ్బంది ప్రశ్నించారు. దాంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు.
శిశువును భారీ నగదుకు తల్లి విక్రయించింది. ఈ విషయం తెలిసి.. కన్న తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ విషయం బహిర్గమైంది. ఈ వ్యవహారంలో నలుగురు మధ్యవర్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.