జిల్లాలో జలుబు, దగ్గు, జ్వరం సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్న 3 నుంచి 4 నెలల వయస్సు గల పిల్లలు రోజుల వ్యవధిలోనే మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని పలు మండలాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన చిన్నారులు జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ జిల్లా కేంద్రంలోని ధర్మశాల వద్ద గల ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గత 40 రోజులుగా వస్తుండడంతో వారిని పరీక్షించిన వైద్యులకు అసలు ఏ వ్యాధితో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతూ రోజుల వ్యవధిలోనే మృతి చెందుతున్నారో అర్థం కాకపోవడంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో అంతుచిక్కని శిశు మరణాలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలోనే ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరణించిన వారందరు నాలుగు నెలల లోపు చిన్నారులు...
సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేస్తారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. కామారెడ్డికి కేసీఆర్ రాకతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంటుంది. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయనున్నందున ఆ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యనేతలు, సామాన్య కార్యకర్తలు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కామారెడ్డిలోనే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ మరింత పటిష్టం కానుంది. అయితే ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారనే వాదన ప్రతిపక్ష వర్గాల నుంచే కాకుండా అధికార పార్టీలోనూ చర్చ సాగుతోంది. కేసీఆర్ రాకతో పార్టీకి మరింత బలం చేకూరడమే కాకుండా వలసలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే మత్స్యకారులకు సిరులు కురిపించే జలపుష్పాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు అందించడం లేదు. చేప పిల్లలను ఇప్పుడు వదిలితేనే వేసవి నాటికి మంచి సైజు, బరువుతో మత్స్యకారుల చేతికి వస్తాయి. వారికి మంచి లాభాలు అందిస్తాయి. గతంలో సెప్టెంబరులో చేప పిల్లలను వదలడంతో ఎదుగుదల లోపించినందున ఈ సారైన ఆలస్యం చేయకుండా చేప పిల్లలను వెంటనే పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
టాలెంట్ ఎవరి సొత్తు కాదు. విద్యార్థులు బాగా చదువుకుని గొప్పగా ఎదగాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ (KG) టూ పీజీ (PG) వరకు విద్యను అందిస్తుంది. 2014- 15లో రూ.9000 కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థకు కేటాయిస్తే ఇప్పుడది రూ.29000 కోట్లకు పెరిగింది. రాష్ట్రంలో 1571 గురుకులాలను అప్ గ్రేడ్ చేశాం.
రెండేళ్ల కాలపరిమితితో నిర్వహించే ఎక్సైజ్ టెండర్ల దరఖాస్తు శుక్రవారంతో ముగిసింది. 2021-23 మద్యం పాలసీ కంటే 2023-24 పాలసీలో దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఆదాయం రూ.43.48 కోట్లు వచ్చింది. గతేడాది కంటే 23 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే మహిళల పేరిట కూడా ఎక్కువ మంది టెండర్లు వేశారు. జిల్లా కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం లక్కీడ్రా నిర్వహించనున్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్యవేక్షణలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్‌రాజ్ ఆధ్వర్యంలో ఇవి కొనసాగనున్నాయి.
కుష్టు అనే చర్మ సంబంధిత వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం వల్ల వ్యాధి తీవ్రంగా మారి అంగవైకల్యం వచ్చి మానసికంగా కుంగి పోతున్నారు. అంతేకాకుండా ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటువ్యాధి కావడంతో సమాజంలో ఈ వ్యాధి సోకిన వారిని ఎవరు హక్కున చేర్చుకోకపోవడం వల్ల విగత జీవులుగా మారి మరణానికి దగ్గరవుతున్నారు. కుష్టు సోకిందంటే చుట్టు పక్కల వారు దూరం పెడుతారనే భయంతో కొందరికి లక్షణాలు కనిపిస్తున్నా వ్యాధి ముదిరేంత వరకు బయటకు రావడం లేదు.
నిర్మల్: టౌన్ మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అలజడి రేగింది. ప్లాన్ రద్దు కోసం ఐదు రోజులుగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకోవడానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయం వేడెక్కుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పట్టు ఉన్న కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వరుస ఓటమి చవిచూసినా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ సెగ్మెంట్లలో టికెట్ల కోసం కొనసాగుతున్న నాయకుల పోటి, పార్టీకి ఉన్న ఓటింగ్ బలానికి అద్దం పడుతోంది. జిల్లాలోని ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు టికెట్ కోసం ఆశావహులు హోరాహోరీగా పోటీ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని అధిష్ఠానం ఇటీవల ఆదేశించింది. దీంతో జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గం నుంచే ఐదుగురు నేతలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి నియోజకవర్గంలో దాదాపు షబ్బీర్‌అలీకే ఖాయం కానుంది. బాన్సువాడలోనూ పోటీ అంత లేకున్నప్పటికీ కొందరు ఆశావహులు టికెట్లు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 2174 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వైన్స్‌షాపులకు ఇంతపెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడం ఇదే మొదటిసారి అని ఎక్సైజ్‌శాఖ అఽధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల కారణంగానే వైన్స్‌లకు డిమాండ్ ఏర్పడిందని, రియల్ రంగం కుదేలుకావడం, ఆ వ్యాపారులంతా మద్యం వ్యాపారానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు నిజాంసాగర్ మండలంలోని బంజేపల్లి వైన్స్‌కు 88 వచ్చాయి.