జిల్లాలో రెండు రోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళ వారం సైతం జిల్లా వ్యాప్తంగా 90.2 మి.మీ వర్షపా తం నమోదైంది. గాంధారిలో కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే గాంధారిలో అత్యధి కంగా 144.5మి.మీ వర్షం కురిసింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గాంధారి, సదాశివనగర్, నాగిరెడ్డిపేట, ఎల్లా రెడ్డి తదితర మండలాల్లోని ప్రాంతాల్లో సుమారు 1200ల ఎకరాలలో వరి, సోయా, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లింది. వరదల తాకిడికి రహదారులు ధ్వంసం అయ్యాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కీలక దశకు చేరుకోవడంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో దరఖాస్తుదారుల్లో తీవ్ర టెన్షన్ నెలకొంటుంది. ప్రస్తుతం జరగనున్న స్ర్కీనింగ్ కమిటీ సభ్యుల పరిశీలనలో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరనుంది. ఎంపిక చేసిన దరఖాస్తుదారుల పేర్లను స్ర్కీనింగ్ కమిటీ ఏఐసీసీకి సీల్డ్ కవర్‌లో పంపనుంది. స్ర్కీనింగ్ కమిటీ రూపొందించే జాబితాలో తమ పేరు ఉందోలేదోననే ఉత్కంఠ దరఖాస్తుదారుల్లో నెలకొంటుంది.
నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District ) దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందులను ఓ ముఠా విక్రయించబోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి ఆ ముఠా గుట్టురట్టు చేశారు.
విద్యారంగాభివృద్ధికి, ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి విద్యాశాఖకు వారధిగా నిలుస్తు, పేద పిల్లలకు సౌకర్యాలతో కూడిన విద్యను బోధిస్తున్న సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట పట్టారు. పని బారెడు జీతం మూరేడు అనే చందంగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని ఆవేదన చెందుతున్నారు. 2008లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్రశిక్ష అభియాన్ అమల్లోకి వచ్చింది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం హైకోర్టు గతంలో నిర్వహించిన బదిలీలపై స్టేను ఎత్తివేయడంతో ఆదివారం నుంచి బదిలీ లకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పార్టీలో ఉన్న నాయకులు మరో పార్టీలోకి చేరగానే ఆ పార్టీ నుంచి ఇంకో నాయకుడిని తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే కామారెడ్డి నియోజకవర్గంలో చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి. తమ పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆయా కుల సంఘాల ప్రతినిధులతోను ఆయా పార్టీల ముఖ్యనేతలు టచ్‌లో ఉంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలు చేరికలే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
నెల రోజులుగా వర్షాలు లేక రైతన్నలు వర్షం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకూ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన గోదావరి వరద జలాల తో శ్రీరాంసాగర్‌ప్రాజెక్టులోని నీరు రంగుమారి కలు షితం అయిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యం లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సంద ర్శించి ప్రాజెక్టు నీటిని పరిశీలించారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లను చేర్చేందుకు చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకు న్నారు.
జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) లక్ష్యం చేరడం లేదు. సీఎంఆర్ విధించిన గడువు ఈనెల చివరికల్ల్లా ముగియనుంది. కానీ జిల్లాలో ఇంకా చాలా మిల్లులు నిర్ధేశించిన లక్ష్యానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల పౌర సరఫరాల శాఖ హెచ్చరికలు చేస్తూ ఆయా యాజమాన్యాలకు నోటీసులు సైతం జారీ చేసింది. గత వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం అప్పగించాల్సిందేనని అందులో పేర్కొంది.