• Home » Telangana » Nizamabad

నిజామాబాద్

Talasani Srinivas: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం

Talasani Srinivas: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం

సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.

రేపటి టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

రేపటి టెట్‌ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం నిర్వహించే టెట్‌ పరీక్ష నిర్వహణలో ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా కొనసాగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, డీఈవో రాజులతో కలిసి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్‌-1, 2 పేపర్ల పరీక్షల కోసం జిల్లా నుంచి 9,740 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో పైరవీలు!

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో పైరవీలు!

విద్యాశాఖలోని బదిలీలు, పదోన్నతులకు పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు జోరుగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడం, అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతుండడంతో కొందరు ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార పార్టీ నేతలతో అనుకున్న పాఠశాలకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు విద్యాశాఖలో చర్చ సాగుతోంది.

Cyber Fraud: కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

Cyber Fraud: కామారెడ్డిలో సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

జిల్లాలో సైబర్ మోసం (Cyber ​​fraud)వెలుగులోకి వచ్చింది. ఆర్మీ జవానని అంటూ నమ్మించి 40 మంది ఆర్మీ జవాన్లకు ఒకేసారి రక్త పరీక్షలు నిర్వహించాలని కామారెడ్డికి చెందిన సూర్ సింగ్ అనే ల్యాబ్ టెక్నీషియన్‌కు సైబర్ కేటుగాడు ఫోన్ చేసి నమ్మించాడు.

Vidyasagar Rao: చంద్రబాబుపై  అన్యాయంగా అక్రమ కేసులు

Vidyasagar Rao: చంద్రబాబుపై అన్యాయంగా అక్రమ కేసులు

దేశంలో రాజకీయ నేతలకు మార్గదర్శిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఉన్నారని తెలంగాణ రాష్ట్ర కమ్మ వారి రాజకీయ ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ ప్రొఫెసర్ విద్యాసాగర్‌రావు(Vidyasagar Rao) వ్యాఖ్యానించారు.

DK aruna: జమిలి ఊహాగానాలే.. డిసెంబర్‌లోనే ఎన్నికలు

DK aruna: జమిలి ఊహాగానాలే.. డిసెంబర్‌లోనే ఎన్నికలు

బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు.

కామారెడ్డి నుండే కేసీఆర్‌ పతనం ప్రారంభం..

కామారెడ్డి నుండే కేసీఆర్‌ పతనం ప్రారంభం..

ఏరి కోరి కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు ఘోరి కట్టడం ఖాయమని, రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని నిజాం తరహా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్‌ పతనం కామారెడ్డి నుండే ప్రారంభం కానున్నందని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. గురువారం భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో నీట మునిగిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను మోకాలి లోతుకు నడుచుకుంటు వెళ్లి మాజీమంత్రి పరిశీలించారు.

పంచాయతీల్లో యూపీఐ సేవలు

పంచాయతీల్లో యూపీఐ సేవలు

గ్రామ పంచాయతీల్లో మరింత పారదర్శకతకు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. ఆదాయ, వ్యయాలపై నిఘా పెడుతునే ప్రతీ పైసా ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేసేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. పన్నులు వసూలవుతున్నాయా వసూలైనవి ఏమవుతున్నాయో లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో పంచాయతీల బలోపేతానికి, డిజిటల్‌ పరంగా మరింత ముందుకు నడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి.

కామారెడ్డి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195 కోట్లు మంజూరు

కామారెడ్డి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195 కోట్లు మంజూరు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎతైన ప్రాంతం కామారెడ్డి నియోజకవర్గమని నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇటీవల సీఎం కేసీఆర్‌కు తాను విన్నవించడంతో స్పందించిన కేసీఆర్‌ వెంటనే నియోజకవర్గ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు రూ.195కోట్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు.

TS News: నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిని ఢీకొన్న స్కూల్ బస్

TS News: నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిని ఢీకొన్న స్కూల్ బస్

జిల్లా కేంద్రంలోని నాగారాం ప్రాంతంలో స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందింది. గాయత్రి నగర్‌లోని చైతన్య స్కూల్లో చిన్నారి హయతి పి పి 1 చదువుతోంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి