కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ( Shabbir Ali ) సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ( Congress ) పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో పడిపోయింది.
జిల్లాలోని జుక్కల్ మండలం డోన్గావ్ గ్రామ పంచాయితీలోని శక్తి నగర్ గ్రామంలో విషాదం నెలకొంది. శక్తి నగర్ కౌలాస్ నాల బ్యాక్ వాటర్ బ్రిడ్జ్‌పై నుండి భార్యని భర్త కిందకు తొసేశాడు. మృతురాలు బిరాదర్ శివాని (20)గా గుర్తించారు.
కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో ఉద్యోగాల పేరిట నకిలీ నియామక పత్రాలు జారీ చేసింది.
Telangana: జిల్లాలోని దోమకొండలో వడ్డీ వ్యాపారి ఇంటిపై మహిళల దాడి చేశారు. కాశీనాథ్ అనే వ్యాపారి వద్ద కామారెడ్డికి చెందిన కవిత రూ.5 లక్షల అప్పు తీసుకుంది.
Telangana: జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్యల కేసులో నిందితుడు గొల్ల ప్రశాంత్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ప్రశాంత్ గ్యాంగ్ దారుణంగా హత్య చేసింది.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిట్ట నిలువునా కేసీఆర్ ప్రభుత్వం ముంచిందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ( MLA Sudarshan Reddy ) పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి బోధన్‌కు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
Telangana: జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇంటి కోసం స్నేహితుడు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ( Shakeel ) బంధువుల రైస్ మిల్లులపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు చేశారు. మిల్లుల్లో కోట్ల రూపాయల సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. రెండు సీజన్లో కలిపి 50732 టన్నుల ధాన్యం అప్పగించినట్లు సమాచారం.
కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు.
Telangana: ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.