కామారెడ్డి జిల్లా: ఏరియా ఆసుపత్రిలో ఎలుకల ఘటనపై అధికారుల చర్యలు చేపట్టారు. పేషెంట్‌ను ఎలుకలు కొరికిన ఘటనలో ఇద్దరు వైద్యులు, నర్సుపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పరిశీలనకు రాగ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం వివరణ కోరింది.
కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం, అక్కాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మండల కేంద్రంలో సహజీవనం చేస్తున్న నరేష్, స్రవంతిలపై మొదటి భార్య, బంధువులు దాడి చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా నరేష్, స్రవంతిలను వివస్త్రాలు చేసి కారం చల్లుతూ దాడి చేశారు.
Telangana: జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రామంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind ) హెచ్చరించారు. బోధన్ మండలం అమ్దాపుర్ గ్రామంలో శనివారం నాడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనకు నెల రోజులు నిండాయని.. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రసాదించడం గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ( Vemula Prashanth Reddy ) అన్నారు. సోమవారం నాడు బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్వయంగా ప్రజా దర్భార్‌లో పాల్గొన్నది ఒక్క రోజు మాత్రమేనని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.
నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశాన్ని సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజా మాజీ ఎమ్మెల్యేల మీద కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అధిష్టానాన్ని కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారని కవిత మండిపడ్డారు.
Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.
Telangana: 2023 సంవత్సరానికి సంబంధించిన కేసుల వివరాలను జిల్లా ఎస్పీ సింధు శర్మ శనివారం మీడియాకు వెల్లడించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య తగ్గినట్లు వెల్లడించారు. 28 హత్యలలో 20 హత్యలు ఆస్తి, కుటుంబ సభ్యుల తగదాలతో జరిగినవన్నారు.
కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం, నర్సింగ్ రావ్ పల్లి శివారులో 161 జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బోలోరో వాహనం మోటార్ సైకిల్‌ను ఢీ కొంది.
ధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupalli Krishna Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించారు.