Telangana: మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ళు కలకలం రేపుతున్నాయి. చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో రైతుల కంటపడింది మొసలి. మొసలిని చూసిన వెంటనే సదరు రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు మొసలిని చూసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు.
Minister Ponnam Prabhakar: మెప్మా ద్వారా మహిళలకు సాయమందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గౌరవెల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్‌కు సంబంధించిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానని చెప్పారు. తన మీద కేసులు ఉన్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
MANDA KRISHNA MADIGA: సాధించిన వర్గీకరణను అమలు కాకుండా కొంతమంది అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో తనకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని తెలిపారు . తన జాతి బిడ్డల కోసమే తన వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయని మంద కృష్ణ మాదిగ అన్నారు.
సిద్దిపేట: పట్టణం కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
HARISH RAO: నవంబర్ వరకు మెస్ ఛార్జీలను వెంటనే రేవంత్ ప్రభుత్వం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారు..1 తేదీన జీతాలు రావడం లేదు..10 వ తేదీన వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.
Telangana: సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి.. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని,
Telangana: వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చి గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక చర్చి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. అలాగే మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా రేవంత్ గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షుడుగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు.
మెదక్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లా: లగచర్ల కేసులో అరస్టయి నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న 16 మంది రైతులు శుక్రవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. రైతులు జైలు నుంచి బయటకు రాగానే గిరిజన సంఘాలు వారికి ఘనస్వాగతం పలికాయి.