సంగారెడ్డి జిల్లా మానూర్ ఏఎస్ఐ గోవింద్ నాయక్ ప్రమాదవశాత్తూ మృతిచెందారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిలుచున్న అతనిపైకి వాహనం దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.
తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చాడు యువకుడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్‌కు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది.
సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది.
సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు.
గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు.
పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా అధికారులు శనివారం ఉదయం నుంచి భారీ ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. అయితే, ఈ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకోవడం, ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా వ్యూహంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐలాపూర్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను తొలగించే ప్రక్రియలో భాగంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.