గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్‌కు చెందిన మణిరాజ్కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.
కొండపాక సత్యసాయి సంజీవని కార్డియాలజీ, రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో ఈ నెల 23వ తేదీన చిన్నారుల గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఇప్పటి వరకు 18 మంది చిన్నారులకు విజయవంతంగా ఆస్పత్రి వైద్యులు శస్త్ర చికిత్సలు నిర్వహించారని కొనియాడారు.
Telangana: ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని.. కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారని హరీష్‌రావు అన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా సిద్దిపేటలో దీక్ష శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై గొర్రెల మందపై తోడేళ్ళు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని మండిపడ్డారు.
Telangana: రైతులకు మద్దతు ధర కల్పించడంలో, పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారన్నారు. మరోపక్క సివిల్ సప్లై కమిషనర్ 70 లక్షల మెట్రిట్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ప్రకటించడం పట్ల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
త్వరలోనే కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తాటి చెట్లు ఎత్తు తక్కువ ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. స్థలం ఉంటే బోర్లు వేసి చెట్లను నాటి కాపాడుకోవాలని అన్నారు.
Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 9:30 గంటలకు నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ సంగారెడ్డికి బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలసి 11 గంటలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. జైలులో ఉన్న లఘుచర్ల గ్రామ రైతులను కేటీఆర్ బృందం పరామర్శించనుంది.
కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.