KCR: బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మెడపై కత్తి పెట్టిన తెలంగాణ కోసం తాను ఎక్కడ వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ తెలిపారు.
మహిళలకు మత్తుమందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ దొంగ స్వామీజీకి చెక్ పెట్టారు మెదక్ జిల్లా పోలీసులు. ఆడవారిని లోబర్చుకుని అత్యాచారాలకు పాల్పడుతున్న దొంగ బాబాను అరెస్టు చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.
Gudem Mahipal Reddy: పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి రెచ్చిపోయి విమర్శలకు దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
హరీశ్ రావుపై బాచుపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతో పాటు మరో ముగ్గురి నుంచి తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 351 (2), ఆర్ డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రాజెక్టు రాకపోయినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుజరాత్లో ప్రధాని మోదీ స్టేట్మెంట్ ఉంది దాని మాదిరిగానే రిజర్వేషన్లు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Road Accident: కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి వాసులు మృత్యువాతపడ్డారు. వారణాసిలో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ, అతడి భార్య ఈ ప్రమాదంలో మరణించారు.
సూర్యాపేట జిల్లాలోని మూడు మండలాల్లో నిన్న (శుక్రవారం) పెద్దఎత్తున చోరీలు జరిగాయి. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు ఏకంగా ఐదు గ్రామాల్లో దోపిడీలకు పాల్పడ్డారు. లక్షల సొత్తు, బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.