• Home » Telangana » Khammam

ఖమ్మం

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్‌వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్‌కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

Suicide: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు

ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

TG News: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.

TG News: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

TG News: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు

Telangana: అమెరికాలో ఖమ్మం యువకుడిపై కాల్పులు కలకలం రేపుతోంది. చికాగోలో దుండగుల కాల్పుల్లో జిల్లాకు చెందిన నూకరపు సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం సాయి తేజ అమెరికాకు వెళ్లాడు. చివరకు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నూకారపు సాయి తేజ కుటుంబం నివాసం ఉంటోంది.

Minister Thummala: నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

Minister Thummala: నేను రాజకీయాల్లోకి రావడానికి కారణమదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్‌లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Minister Thummala: ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తాం..  మహిళలు ముందుకు రావాలి

Minister Thummala: ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తాం.. మహిళలు ముందుకు రావాలి

మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.

BRS: రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం: హరీష్‌రావు

BRS: రైతులకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాం: హరీష్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్‌రావు అన్నారు.

Khammam: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Khammam: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి