ఖమ్మం: జిల్లా కలెక్టర్ అంటేనే పెద్ద బాధ్యత. సమీక్షలు, సమావేశాలు అంటూ ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంటారు. ముఖ్యమంత్రితో చర్చలు, మంత్రులతో మీటింగులు, అధికారులతో సమావేశాలంటూ ఊపిరాడని పని ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి గడిపే సమయం కూడా వారికి దొరకడం కష్టంగా మారుతుంటుంది.
ఖమ్మం: తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్ గడ్, బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌తో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ సరిహద్దు వద్ద హై అలర్ట్ చేశారు. మావోయిస్టలు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా మారింది. భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
Minister Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.
TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.
Minister Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ తెలిపారు. ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వాల్సిన పని లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనంకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ పరిసరాలు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు.
Telangana:ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతిచెందారు. బస్సు టైరు పేలడంతోనే ఈఘటన జరిగినట్లు తెలుస్తోంది.యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన బస్సు ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుంది.