సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో సంగారెడ్డి శాసనసభ స్థానం ఒకటి. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,26,878గా ఉంది. 2004 వరకు జనరల్ స్థానంగా ఉంది. 2009 నుంచి ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మార్చారు. ఈ స్థానం జహీరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. జహీరాబాద్, కోహిర్, న్యాల్‌కల్, ఝరసంగం, మొగుడంపల్లి మండలాలు ఇందులో ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి జాబితా విషయానికి వస్తే 1952లో గుండె రావు (కాంగ్రెస్), 1957, 1962, 1967, 1972, 1978, 1983, 1985 వరుసగా ఎం. బాగా రెడ్డి కాంగ్రెస్ తరపున గెలుస్తూ వచ్చారు. ఇక 1989లో పట్లోళ్ల నర్సింహరెడ్డి (కాంగ్రెస్), 1994లో సీ.బాగన్న (టీడీపీ), 1999, 2004లో మహమ్మద్ ఫరీదుద్దీన్ (కాంగ్రెస్) గెలిచారు. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మార్చాక 2009, 2014లో వరుసగా కాంగ్రెస్ తరపున గీతారెడ్డి గెలిచారు. 2018లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన కొనింటి మాణిక్ రావు గెలిచారు. 2018లో పోటీ ఎవరి మధ్య..? 2018లో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. కే.మాణిక్ రావు తన సమీప అభ్యర్థి జే.గీతారెడ్డిపై 34,473 ఓట్ల తేడాతో గెలిచారు. మాణిక్ రావుకి 96,598 ఓట్లు, గీతారెడ్డికి 62,125 ఓట్లు, జంగం గోపీకి 19,454 ఓట్లు పడగా నోటాకి 1884 ఓట్లుపడ్డాయి. ఇక 2014లో జే.గీతారెడ్డి కేవలం 842 ఓట్ల తేడాతో గెలిచారు. త్రిముఖ పోరులో కాంగ్రెస్‌కి 57,558 ఓట్లు, టీఆర్ఎస్(కే.మాణిక్ రావు) 56,716 ఓట్లు, టీడీపీకి (ఎర్పుల నరోత్తమ్) 39,057 ఓట్లుపడ్డాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |