ఇల్లందు నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఒకటి. ఇది మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోత్ హరిప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇల్లందు, కామేపల్లి, బయ్యారం, తెరులపల్లి, గార్ల మండలాలున్నాయి. మొత్తం 1,81,676 ఓటర్లు ఉన్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా కొండపల్లి లక్ష్మీనరసింహరావు ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆయనే సీపీఐ నుంచి 1957, 1962 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1967లో సత్యనారాయణ రావు(కాంగ్రెస్), 1972లో వంగ సుబ్బా రావు(కాంగ్రెస్), 1978లో ఎర్రయ్య(సీపీఐ), 1983, 1985, 1989లలో వరుసగా గుమ్మడి నర్సయ్య(సీపీఐ), 1994లో అబ్బయ్య(సీపీఐ), 1999, 2004లలో గుమ్మడి నర్సయ్య(సీపీఐ), 2009లో అబ్బయ్య(టీడీపీ), 2014లో కోరం కనకయ్య(కాంగ్రెస్), 2018లో బానోత్ హరిప్రియ(కాంగ్రెస్) గెలుపొందారు. 2018లో.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ 70,644 ఓట్లతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్యకు 67,757 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి గుమ్మడి నర్సయ్యకు 12,899 ఓట్లు పోలయ్యాయి. అనంతరం బానోత్ హరిప్రియ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 42.95 శాతం, టీఆర్ఎస్ కు 41.20 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉండింది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |