• Home » Telangana » Assembly Elections » Yakutpura

హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో యాకుత్‌పురా ఒకటి. గతంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009 నాటి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత యాకుత్‌పురా నియోజకవర్గంగా మారిపోయింది. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 1989 వరకూ ఎంఐఎం ఒకే పార్టీగా ఉండేది. అయితే 1994 తర్వాత పార్టీలో చీలిక వచ్చి మహ్మద్ అమానుల్లాఖాన్ నాయకత్వంలో మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో 3,32,818 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,71,110 మంది, మహిళా ఓటర్లు 1,616,81 మంది ఉన్నారు. యాకుత్‌పురా, మాదన్నపేట్, దాబీర్ పురా, లాల్ దర్వాజా, ఉప్పుగూడ (కొంత భాగం) ఈ నియోజకవర్గం కిందకు వస్తాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్.. తన సమీప ప్రత్యర్థి అంజూబిన్ ఉమర్ (ఎంబీటీ) పై 43,298 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎంకు చెందిన సిటింగ్ ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్.. తన సమీప ప్రత్యర్థి రూప్ రాజ్ (బీజేపీ) పై 34,423 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అహ్మద్ ఖాన్‌కు 66,843 ఓట్లు రాగా, రూప్ రాజ్‌కు 32,420 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి చెందిన సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రి.. తన సమీప ప్రత్యర్థి సామ సుందర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 46,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో అహ్మద్ పాషాఖాద్రికి 69,595 ఓట్లు రాగా, సామ సుందర్ రెడ్డికి 22,617 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

యాకుత్‌పుర నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి