హన్మకొండ జిల్లాలోని నియోజకవర్గాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఒకటి. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఈ నియోజవర్గంలో హన్మకొండ, కాజీపేట మండలాలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,66,825 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,32,761 మంది పురుషులు, మహిళా ఓటర్లు 1,34,053 మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికలు.. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డిపై (టీడీపీ) 36,451 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వినయ్ కుమార్‌కు 81,006 ఓట్లు పడగా ప్రకాష్ రెడ్డికి 44,555 ఓట్లు వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి స్వర్ణపై (కాంగ్రెస్) 56,304 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వినయ్ కుమార్‌కు 83,492 ఓట్లు పడగా స్వర్ణకు 27,188 ఓట్లు పోల్ అయ్యాయి. 2009 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాస్యం వినయ్ కుమార్.. తన సమీప ప్రత్యర్థి కొండపల్లి దయాసాగర్ రావు (కాంగ్రెస్) పై 6,684 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వినయ్ కుమార్‌కు 45,807 ఓట్లు రాగా.. దయాసాగర్ రావుకు 39,123 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన వినయ్ కుమార్.. అనంతర కాలంలో రాజీనామా చేయడంతో 2010 జూలైలో ఉప ఎన్నికలు వచ్చాయి. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ కుమార్.. తన సమీప ప్రత్యర్థి కేడీ రావు (కాంగ్రెస్) పై 67,524 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వినయ్ కుమార్‌కు 88,449 ఓట్లు రాగా.. కేడీ రావుకు 20,925 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |