• Home » Telangana » Assembly Elections » Vikarabad

వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది ఒకటి. మర్రి చెన్నారెడ్డి 1952, 57లో ఇక్కడి నుంచే గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో వికారాబాద్, మర్‌పల్లి, మోమిన్‌పేట్‌, ధరూర్, బంట్వారం, కొట్‌పల్లి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,11,029 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,06,869 మంది పురుషులు, 1,04,157 మంది మహిళా ఓటర్లు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్ కుమార్.. తన సమీప ప్రత్యర్థి చంద్రశేఖర్ (బీఆర్ఎస్) పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 13వ శాసనసభలో ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి కూడా లభించింది. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సంజీవరావు.. తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ (కాంగ్రెస్) పై 10,072 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సంజీవరావుకు 64,592 ఓట్లు రాగా, ప్రసాద్‌ కుమార్‌కు 54,520 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మెతుకు ఆనంద్.. తన సమీప ప్రత్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ (ప్రజాఫ్రంట్, కాంగ్రెస్) పై 2,993 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆనంద్‌కు 60,574 ఓట్లు రాగా, ప్రసాద్ కుమార్‌కు 57,581 ఓట్లు వచ్చాయి. 2023లోనూ బీఆర్ఎస్ తరపున ఆనంద్, కాంగ్రెస్ తరపున ప్రసాద్ కుమార్ పోటీ చేయనున్నారు.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

వికారాబాద్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి