సూర్యాపేట్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో తుంగతుర్తి ఒకటి. ఈ నియోజకవర్గంలో తిరుమలగిరి, తుంగతుర్తి , నూతనకల్, జాజిరెడ్డిగూడెం, నగరం, మద్దిరాల, శాలిగౌరారం, అడ్డగుదురు, మోత్కూర్ మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,99,007 ఓట్లు ఉన్నాయి. వీరిలో పురుషులు 1,01,405 ఉండగా.. మహిళా ఓటర్లు 97,602 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గడారి కిషోర్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు.. తన సమీప అభ్యర్థి జి.నర్సయ్య (కాంగ్రెస్) పై 11,863 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నర్సింహులుకు 80,888 ఓట్లు రాగా.. నర్సయ్యకు 69,025 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున గాదరి కిషోర్ కుమార్.. తన సమీప ప్రత్యర్థి అద్దంకి దయాకర్ (కాంగ్రెస్) పై 2,379 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కిషోర్ కుమార్‌కు 64,382 ఓట్లు రాగా.. దయాకర్‌కు 62,003 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్.. తన సమీప ప్రత్యర్థి అద్దంకి దయాకర్ (కాంగ్రెస్) పై 1,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కిషోర్ కుమార్‌కు 90,857 ఓట్లు రాగా.. దయాకర్‌కు 89,010 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |