వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తాండూరు ఒకటి. ఈ నియోజకవర్గంలో తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల్ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,28,544 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,11,242 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,17,243 మంది, ట్రాన్స్ జెండర్స్ 10 మంది, సర్వీస్ ఓటర్లు 49 మంది ఉన్నారు. 1952లో ఏర్పడిన ఈ నియోజవర్గంలో తొలి ఎన్నికల్లో జేకే ప్రాణేచ్ఛారి ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, మాజీ మంత్రులు ఎం.మాణిక్ రావు, ఎం.చంద్రశేఖర్ వంటి ప్రముఖులు తాండూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి.మహేందర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి మల్కోడ్ రమేష్ (కాంగ్రెస్) పై 13,203 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి 63,737 ఓట్లు రాగా, రమేష్‌కు 50,534 ఓట్లు వచ్చాయి. మొత్తం 16మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 14 మంది డిపాజిట్లు కోల్పోయారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సిటింగ్ ఎమ్మెల్యే అయిన పి.మహేందర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఎం.నారాయణరావు (కాంగ్రెస్) పై 16,074 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి 61,294 ఓట్లు రాగా, నారాయణరావుకు 45,219 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి పట్నం మహేందర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 2,875 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి 70,428 ఓట్లు రాగా, మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |