• Home » Telangana » Assembly Elections » Suryapet

సూర్యాపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సూర్యాపేట కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో సూర్యాపేట, సూర్యాపేట మున్సిపాలిటీ, చివ్వేంల, పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్) మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,11,097 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,04,401 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,06,624 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.దామోదర్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి పి.చంద్రశేఖర్ రెడ్డి (బీఆర్ఎస్) పై 6,197 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో దామోదర్ రెడ్డికి 57,014 ఓట్లు రాగా.. చంద్రశేఖర్ రెడ్డికి 50,817 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఎస్.వెంకటేశ్వరరావు (ఇండిపెండెంట్) పై 2,219 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డికి 43,554 ఓట్లు రాగా.. వెంకటేశ్వరరావుకు 41,335 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి.. తన సమీప ప్రత్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (కాంగ్రెస్) పై 5,967 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డికి 68,650 ఓట్లు రాగా.. దామోదర్ రెడ్డికి 62,683 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

సూర్యాపేట నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి