సిరిసిల్ల నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రమంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,08,570గా ఉంది. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట్, గంభీరావ్‌పేట్, ముస్తాబాద్, తంగలపల్లి, వీర్ణాపల్లి మండలాలు ఈ నియోజకవర్గం కిందికి వస్తాయి. ఇక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి విషయానికి వస్తే.. 1962లో జువ్వాడి నర్సింగా రావు (కాంగ్రెస్), 1967లో చెన్నమనేని రాజేశ్వరరావు (సీపీఐ), 1972లో జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), 1978లో చెన్నమనేని రాజేశ్వర్ రావు (సీపీఐ), 1983లో వచిడి మోహన్ రెడ్డి (స్వతంత్ర), 1985లో చెన్నమనేని రాజేశ్వర్ రావు (సీపీఐ), 1989లో ఎన్వీ కృష్ణయ్య (స్వతంత్ర), 1994లో చెన్నమనేని రాజేశ్వర్ రావు(సీపీఐ), 1999లో రేగులపాటి పాపారావు (కాంగ్రెస్), 2004లో చెన్నమనేని రాజేశ్వర్ రావు (టీడీపీ) గెలుపొందగా.. 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన కేటీఆర్ విజయం సాధించారు. 2018లో పోటీ ఎవరెవరి మధ్య? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన కేటీఆర్ భారీ విజయాన్ని సాధించారు. తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కొండం కరుణ మహేందర్ రెడ్డిపై ఏకంగా 89,009 ఓట్ల భారీ మెజారిటీని అందుకున్నారు. మొత్తం 80.88 శాతం పోలింగ్ నమోదవ్వగా కేటీఆర్‌కు 1,25,213 ఓట్లు, మహేందర్ రెడ్డికి 36,204 ఓట్లు, ఆవునూరి రమాకాంత్‌కి 3,245 ఓట్లు, మల్లుగారి నర్సా గౌడ్‌కు 3,243, నోటాకి 2,321 ఓట్లు పడ్డాయి. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన కేటీఆర్ తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండూరు రవీందర్ రావుపై 53,004 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆకుల విజయ్‌కి 14,494 ఓట్లు, నోటాకి 1650 ఓట్లు చొప్పున పడ్డాయి. దీంతో వరుస ఎన్నికల్లో ఈ సీటును బీఆర్ఎస్ నిలబెట్టుకుంటూ వస్తోంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |