సిద్ధిపేట జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదొకటి. జనరల్ స్థానమైన ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,02,359గా ఉంది. ఈ నియోజకవర్గం మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. తెలంగాణ రాష్ట్రమంత్రి తన్నీరు హరీష్ రావు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. సిద్ధిపేట అర్భన్, సిద్ధిపేట రూరల్, చిన్నకొడూరు, నంగునూర్, నారాయణరావుపేట మండలాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారి జాబితాను పరిశీలిస్తే.. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికలు 1952లో అడ్ల గుర్వా రెడ్డి (పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్) విజయం సాధించారు. ఆ తర్వాత 1957లో పీవీ రాజేశ్వర్ రావు (కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు (స్వతంత్ర), 1967లో వీబీ రాజు (కాంగ్రెస్), 1970(ఉపఎన్నిక)లో స్వతంత్రంగా, 1972, 1978, 1983లో కాంగ్రెస్ తరపున ఏ మదన్ మోహన్ విజయం సాధించారు. ఇక 1985, 1989, 1994, 1999లో టీడీపీ తరపు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గెలిచారు. అనంతరం టీఆర్ఎస్ తరపున 2001 ఉపఎన్నికలో, 2004 ఎన్నికల్లోనూ కేసీఆరే విజయం సాధించారు. ఆ తర్వాత 2004(ఉపఎన్నిక), 2008 (ఉపఎన్నిక), 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లోనూ తన్నీరు హరీష్ రావు విజయాలు సాధించారు. 2018లో పోటీ ఎవరి మధ్య? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచిన తన్నీరు హరీష్ రావు బంపర్ మెజారిటీ సాధించారు. ఏకంగా 1,18,699 మెజారిటీతో రికార్డ్ స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన సమీప అభ్యర్థి భవాని మరికంటికి(12,596), నాయినీ నరోత్తమ్ రెడ్డి (11,266), నోటాకు 2,932 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ తన సీటును తాను నిలబెట్టుకుంది. ఇక ఏర్పాడ్డాక జరిగిన తొలి ఎన్నిక 2014ను పరిశీలిస్తే.. తన్నీరు హరీష్ రావు ఏకంగా 93,328 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రెండవ స్థానంలో నిలిచిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌కి 15,371 ఓట్లు, సొప్పదండి విద్యాసాగర్‌కి 13,003, నోటాకి 1664 ఓట్లు మాత్రమే పడ్డాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |