ఎన్నిక సాధారణమైనా.. బై-ఎలక్షన్ అయినా భారీ మెజారిటీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచే టీ.హరీష్ రావు ఈసారి కూడా సిద్ధిపేట నియోజకవర్గం నుంచి తెలంగాణ ఎన్నికలు -2023 బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ తరపున సిద్ధిపేట నుంచి హరికృష్ణ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా వీరి మధ్య పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి, టీజేఎస్ నుంచి పోటీ చేసిన భవాని మరికంఠిపై ఏకంగా 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2014లో కూడా హరీష్ రావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన తాడూరి శ్రీనివాస్ గౌడ్‌పై 15,371 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే 2004 (By Polls), 2008 (By Polls), 2009, 2010 (By polls), 2014, 2018 ఎన్నికల్లో వరుస పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 52 | 5 | 242,906,736 | Graduate | 115,001,120 |