రంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో షాద్ నగర్ నియోజకవర్గం ఒకటి. షాద్‌నగర్, కొత్తూరు, నందిగాం, కేశంపేట, కొందుర్గ్, చౌదర్ గూడెం మండలాలు ఉన్నాయి. ఈ స్థానాన్ని కాంగ్రెస్ అత్యధిక సార్లు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 2 సార్లు, టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఇక్కడ గెలిచాయి. గతంలో షాద్‌నగర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా ఉండేది. కానీ జిల్లాల విభజన తర్వాత రిజర్వుడ్ నుంచి జనరల్‌కు మారింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు 2 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా టీఆర్ఎస్ అభ్యర్థే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వై. అంజయ్య యాదవ్ 2018 ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల్లో అంజయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 17,328 ఓట్ల తేడాతో గెలుపు కైవసం చేసుకున్నారు. అంజయ్యకు 70,315 ఓట్లు, ప్రతాప్‌రెడ్డికి 52,987 ఓట్లు పోలయ్యాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నిలిచింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిపై 20,556 ఓట్ల తేడాతో గెలిచారు. అంజయ్యకు 72,315 ఓట్లు రాగా ప్రతాప్‌రెడ్డికి 51,890 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి అంజయ్య యాదవ్ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి శంకరయ్య, బీజేపీ నుంచి అందె బాబయ్య, ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి బరిలో నిలిచారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |