హైదరాబాదు జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో మారేడ్‌పల్లి, త్రిముల్గేరి, బొల్లారం, సిక్కు గ్రామం, లోత్కుంట, కార్ఖానా, బేగంపేట (భాగం), రాష్ట్రపతి రోడ్ (భాగం) ఉన్నాయి. మొత్తం 2,39,771 ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,21,225 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,18,538 మంది ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగ్గా.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఏడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, జనతా పార్టీ ఓసారి గెలిచాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఏకైక ఎస్సీ నియోజకవర్గం కంటోన్మెంట్. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున 2018లో జి.సాయన్న భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈయన 2023 ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతిచెందారు. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జి.సాయన్న.. తన సమీప ప్రత్యర్థి గజ్జెల నాగేష్ (బీఆర్ఎస్) పై 3,275 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సాయన్నకు 44,693 ఓట్లు రాగా, నాగేష్‌కు 41,418 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జి.సాయన్న.. తన సమీప ప్రత్యర్థి సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్) పై 37,563 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సాయన్నకు 65,797 ఓట్లు రాగా, సత్యనారాయణకు 28,234 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |