సంగారెడ్డి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంగారెడ్డి శాసనసభ స్థానం ఒకటి. రాష్ట్రంలో 39వ నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానం మెదక్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి ఓటర్ల సంఖ్య 2,03,379గా ఉంది. సంగారెడ్డి, కొండాపూర్, హత్‌నూర, సదాశివపేట, కండీ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయి. గతంలో ఇక్కడి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారి జాబితాను పరిశీలిస్తే.. 1957లో క్రిష్ణమాచారి (స్వతంత్ర), 1962లో పీ.రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), 1967లో నరసింహరెడ్డి (స్వతంత్ర), 1972లో పీ.రామచంద్రారెడ్డి (కాంగ్రెస్), 1978, 1983(స్వతంత్ర), 1985(కాంగ్రెస్), 1989(కాంగ్రెస్)లో పీ.రామచంద్రారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 1994లో కే.సదాశివరెడ్డి (టీడీపీ), 1999లో కే.సత్యనారాయణ (బీజేపీ), 2004(టీడీపీ), 2009లో(కాంగ్రెస్) తరపున తూరుపు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) విజయం సాధించారు. 2014లో చింతా ప్రభాకర్ (టీఆర్ఎస్), 2018లో తూరుపు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ తరపున గెలిచారు. 2018లో పోటీ విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో 82.83 శాతం పోలింగ్ నమోదవ్వగా తన సమీప అభ్యర్థి చింతా ప్రభాకర్(టీఆర్ఎస్)పై జగ్గారెడ్డి 2,589 ఓట్ల తేడాతో గెలిచారు. జగ్గారెడ్డికి 76,572 ఓట్లు, చింతాప్రభాకర్‌కి 73,983 ఓట్లు, దేశ్‌పాండే రాజేశ్వర్ రావుకి 7,628 ఓట్లు పడ్డాయి. చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు, చిన్నచిన్న పార్టీల తరపున ఇక్కడి నుంచి చాలామంది పోటీ చేశారు. ఇక 2014లో పోటీ విషయానికి వస్తే.. టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన చింతా ప్రభాకర్‌కి 82,860 ఓట్లు పడగా 29,522 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. జగ్గారెడ్డికి (కాంగ్రెస్) 53,338 ఓట్లు, కే.సత్యనారాయణికి 11,914 ఓట్లు, బీ.మల్లేశంకి(సీపీఐఎం) 2,684 చొప్పున ఓట్లుపడ్డాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |