తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 2023లో కూడా తన సిట్టింగ్ స్థానం సనత్‌నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ కోట నీలిమ, బీజేపీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి బరిలో నిలిచారు. ప్రధానంగా వీరి మధ్యే పోటీ ఉండనుంది. వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. తలసాని వ్యక్తిగత ప్రొఫైల్ విషయానికి వస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కీలక పదవుల్లో పనిచేశారు. 1986లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1986లో కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్రనాథ్‌ను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా టీడీపీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం పద్మారావుగౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. అనంతరం 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మరోసారి పద్మారావు గౌడ్ చేతిలో తలసాని ఓటమిపాలయ్యారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ 2014లో సనత్‌నగర్ నియోజకవర్గానికి మారి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరి కేసీఆర్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ఎన్నికల్లో కూడా మళ్లీ సనత్‌నగర్ నుంచే గెలుపొంది కేసీఆర్ మంత్రివర్గంలో పశుసంవర్థక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు.
| Age | Cases | Total Assets | Education | Liabilities |
|---|---|---|---|---|
| 58 | 0 | 749,101,504 | 12th Pass | 138,894,576 |