పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్‌ఎస్ నేత కోరుకంటి చందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో మొత్తం 1,59,953 ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని రామగుండం, కమాన్‌పూర్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. 2018 నాటి ఎన్నికల్లో కోరుకంటి చందర్ తన సమీప ప్రత్యర్థి సోమారపు సత్యనారాయణపై 26,419 వోట్ల మెజారిటితో గెలిచారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్‌కు 60,444 ఓట్లు, సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి. అంతకుమునుపు 2014 నాటి ఎన్నికల్లో సోమారపు సత్యనారాయణ చందర్‌పై 2,295 వోట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సోమారపు సత్యనారాయణ తన సమీప పీఆర్‌పీ ప్రత్యర్థి కౌశిక హరినాథ్‌పై 2,220 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రామగుండం లో ఎన్.టి.పి.సి., సింగరేణి కోల్, తెలంగాణ పవర్ జెన్ కో కంపెనీలు ఉన్నాయి. ఎన్.టి.పి.సి. థర్మల్ పవర్ ద్యారా 2600 మెగావాట్ల కరెంట్‌ను 10 మెగావాట్ల. సౌరవిద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. రామగుండం పవర్ హౌజ్ థర్మల్ ద్వారా 60 మెగా వాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతోంది.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |