• Home » Telangana » Assembly Elections » Rajendranagar

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా పేరుగాంచిన రాజేంద్రనగర్.. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. గతంలో చేవెళ్ల, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఈ ప్రాంతాన్ని 2007లో నియోజకవర్గా పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలు ఉన్నాయి. అలాగే రాజేంద్రనగర్‌లో మొత్తం 5,52,323 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,88,270 మంది, మహిళా ఓటర్లు 2,64,053 మంది ఉన్నారు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా టి.ప్రకాశ్ గౌడ్ గెలుస్తూ వచ్చారు. 2009 ఎన్నికలు.. 2009 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ప్రకాశ్ గౌడ్.. తన సమీప ప్రత్యర్థి జ్ఞానేశ్వర్ (కాంగ్రెస్) పై 7,485 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ గౌడ్‌కు 49,522 ఓట్లు, జ్ఞానేశ్వర్‌కు 42,037 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టి.ప్రకాష్ గౌడ్.. తన సమీప ప్రత్యర్థి జ్ఞానేశ్వర్ (కాంగ్రెస్) పై 25,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ గౌడ్‌కు 77,843 ఓట్లు, జ్ఞానేశ్వర్‌కు 51,962 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన టి.ప్రకాష్ గౌడ్.. తన సమీప ప్రత్యర్థి రేణుకుంట్ల గణేష్ (టీడీపీ) పై 58,373 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ గౌడ్‌కు 108,964 ఓట్లు, గణేష్‌కు 50,591 ఓట్లు వచ్చాయి.

Readmore

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2018

2023 2018 2014
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00
పార్టీ

బి.ఆర్.ఎస్

కాంగ్రెస్

బి.జె.పి+

ఎంఐఎం

ఇతరులు

ఆదిక్యం 00 00 00 00 00
గెలుపు 00 00 00 00 00

రాజేంద్రనగర్ నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

తెలంగాణ విజేత/ఓడిపోయిన నియోజకవర్గ ఫలితాలు 2018

2023 2018 2014

Latest News

తాజా వార్తలు

మరిన్ని చదవండి