ఖుత్బుల్లాపూర్ నియోజకవర్గం మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో కుతుబుల్లాపూర్ మండలం ఒక్కటే ఉంది. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఖుత్బుల్లాపూర్‌లో మొత్తం 6,12,700 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,22,566 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,90,010 మంది, ఇతరులు 124మంది ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికలు.. 2009లో జరిగిన ఎన్నికల్లో ఖుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీశైలం గౌడ్.. తన సమీప ప్రత్యర్థి వివేకానంద గౌడ్ (బీఆర్ఎస్) పై 23,216 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్‌కు 53,753 ఓట్లు రాగా.. వివేకానంద గౌడ్‌కు 30,534 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేపీ వివేకానంద గౌడ్.. తన సమీప ప్రత్యర్థి కొలన్ హన్మంతరెడ్డి (బీఆర్ఎస్) పై 39,021 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వివేకానంద గౌడ్‌కు 1,14,236 ఓట్లు రాగా.. హన్మంతరెడ్డికి 75,214 ఓట్లు దక్కాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్‌కు 40,199 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికలు.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన కేపీ వివేకానంద గౌడ్.. తన సమీప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్ (కాంగ్రెస్) పై 41,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వివేకానంద గౌడ్‌కు 1,54,500 ఓట్లు, శ్రీశైలం గౌడ్‌కు 1,13,00 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |